పుట:Ecchini-Kumari1919.pdf/177

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

ఇచ్చిని కుమారి


సమాధానము చెప్పుఁడు' అని యడుగఁ గరుణరాజు మంద హాసము చేయుచు నిట్లనియె. 'కుమారా ! నీ వింకను లేఁబ్రా యుపు వాఁడవు, రాజనీతి విషయములు నీమనస్సున కింకను బట్ట లేదు. నీకుఁ బరమశత్రువులగు చాళుక్యులను జేరఁదీయుట కేవలము రాజనీతి విరుద్ధము. నా కది మొదటి నుండియు నిష్టము లేదు, నీవును, నీమంత్రులు నేదియో గుసగుసలాడి వారి కాశ్రయ మిచ్చితిరి. నాఁడు సభలో వారియెదుట నే వారిని జేరఁదీయ రాదని చెప్పుట యయుక్త మని యూరకుంటిని. అనంతరము నీతో వీరిని బంపి వేయు మని యనేక పర్యాయ ములు బోధించితిని. అయినను నీవు నామాటలు సరకుగొన వైతివి. నాఁడు చాందుభట్టు నున వారిని వర్ణించునప్పుడు వారిలో పెద్దవాడగు ప్రతాప సింగు చూపిన వికారము నాయనుమానమును, గోపమును మఱింత వర్ధించెను. కనుకనే నేను వారిని జంపితిని. వారు చేసిన యపరాధము పైకిఁ గనఁబడదు. కాని, సూక్ష్మబుద్ధితో నరసిన వారికి వారు మన యెడఁ జూపుచున్న హేయబుద్ధి తెలియక పోదు. అయి నను నాఁడు నీవు కోపించి నప్పటినుండియు నేను వారి జోలికిఁ బోవ లేదు. వారిచర్యలను మాత్రము పరిశీలించు చుంటిని. అట్టిదుష్టులను నీ నంగరక్షకులనుగాఁ జేసికొంటివి. నిన్నటి దొమ్మి యుద్ధమున నిన్ను వా ర నేక పర్యాయములు జంప యత్నించిరి. కాని, నేను సర్వదా నిన్నుఁ గంటికి రెప్పవలె గాచియుండుట చే వారియాటలు సాగినవి కావు. ఇట్లుండ నిన్న సాయంసమయమున నిరువురువీరులు నా చెంతకు వచ్చి యీ రాతి రాజభవనమునఁ బెద్ద ఘోర కృత్యము చేయ నాచాళుక్యు లాలోచించుచున్నా రని చెప్పిరి, వా రెంత ఘోరకృత్య