పుట:Ecchini-Kumari1919.pdf/179

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

ఇ చ్ఛినీ కు మారి


“నీ ప్రియురాలగు నిచ్ఛినీ కుమారియే పురుష వేషముతో నట్లు వచ్చి నీప్రాణరక్షణమునకై యెక్కువ శ్రమ చెందెను' అని కరుణరాజ నెను.

అందులకు రాజు మఱింత యాశ్చర్యము చెంది 'ఆఁ! రాకుమారియా! ఇచ్చి నీకుమారియా! నిన్న రాత్రి నీతో నా చెంతకు వచ్చినది యిచ్చినియా! ఆమె కంతచాతుర్యము గలదా! మంచి నిశీథములందు శత్రువులను జంపుసాహసము గలదా యామెకు?' అని మఱి మఱి ప్రశ్నింపనారంభిం చెను, 'కుమారా! ఇచ్ఛిని తెలివి తేటలను, ధైర్యసాహసాదు లను నామె గురువగు నీ యీశ్వర భట్టుగ దా వర్ణింపన లె' నని చెప్పి యొక పురుషునిఁ జూ పెను.

ఆపురుషుఁడు లేచి పృథ్వీరాజున క భీముఖుఁడై నిలిచి ' రాజేంద్రా! ఇచ్ఛిని సద్గుణములు వర్ణింప నాతరముగాదు. నాఁ డామె తమకు వ్రాసినయుత్తరమె యామేచాతుర్యముఁ గొంతవఱకు వెల్లడించును. ఒకమా రస్ర చాతుర్యమును జూపుచు భీమ దేవుని టెక్కెమును దెగ వేసి యతని కాశ్చ ర్యమును గల్గించినది. మఱియు నామె బాణమున కుత్తరము ను గట్టి నా చెంతకుఁ బంపినది. దానినే దేవర వారి కర్పించు కొంటిని. ఆమె నాదుర్గ మునుండి తప్పించుట విషయమై మే ముత్తరములవలన నొండొరుల యభిప్రాయము తెలిసికొనుచు భీమరాజువలనఁ బురుషులు ధరించుదుస్తులను బుచ్చుకొనుమని నే నొకన్నాడు తెలుపఁగా నామె యట్లు చేసినది. మఱికొన్ని దినములకు నే నొక సేవకుని వేషముతో మధుమం తుడు పంపిన ట్లోక యుత్తరమును గల్పించి భీమరాజునకు జూపి మోసపుచ్చితిని. అతఁడును, రూపవతియు నాయుత్తర