పుట:Ecchini-Kumari1919.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

ఇచ్చనీ కు మారి


వానిని దనవంకకు మరలించెను. భీముఁడు వృద్వీరాజును జూచినంత నే క్రోధోద్దీపితుఁడై విల్లెక్కిడి బాణవర్షము , గురి యింపఁ జొచ్చెను. ఒకరి నొక రెదుర్కొని ద్వంద్వయుద్ధమున కారంభించిరి. పరాక్రమశాలులును, ధనుర్విద్యయందుఁగుళలు లును నగు వారి యుద్ధ చాతుర్యమును జూచుచు నిరుపు ములవా రట్లే నిలిచిపోయిరి. బాణములు వింటఁ గూర్చునపు డును, బ్రయోగించునపుడును న తిలాఘనమును జూపుచు నా వీరులు చూపటి కాశ్చర్యమును గొల్పుచుండిరి. నాఁ డా యుద్ధమును జూచిన వారు భారత యుద్ధమునందు మిగుల వాసి గాంచిన కర్ణార్జునుల యెక్కటి కయ్యమును స్మరింపక పోరు.. ఇ ట్లొక గడియకాల మగునప్పటికీఁ బృద్వీరాజు తన తీవ్ర బాణము లచే భీముని మూర్ఛిల్లఁ జేసెను. భీమునిదుర వస్థను జూచి మావటీఁడు తన యేనుఁగును యుద్ధభూమినుండి మరలించెను. భీముఁడు మూర్చిల్లి నతోడ నే ఘూర్జరులు ధైర్యము విడిచి పారి పోవఁజొచ్చిరి. ఢిల్లీ సైనికులు వారిని దుర్గముచొచ్చునంత వఱకును దఱిమితరిమి కొట్టిరి. నాఁటిమహాయుద్ధమునఁ బృథ్వీ రాజును జయలక్ష్మి వరించెను,

తొమ్మి ద ప ప క ర ణ ము

రాజద్రోహము

యుద్ధము ముగిసిన నాఁటి రాత్రి రెండుజాముల కాలము గడచిన పిమ్మటఁ బృథ్వీరాజు సేనాని వేశమునకుఁ బది బారల దూరమందున్న యొక చెట్టు క్రింద నొక మనుష్యుఁడు కూర్చుండి యెవరి నిమిత్తమో యెదురు చూచుచుండెను. కొంత సేపటికి సేనాని వేశమునుండి బయలు వెడలి యైదుగురు మనుష్యులు