పుట:Ecchini-Kumari1919.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము 28

169



క్రమముగా క్షీణబలుఁడై వీరస్వర్గము చెందెను. అయినను నతని సాహసమును, శౌర్యమును, ధైర్యమును బొగడనివా రిరుపక్షములందు నొక్కరును లేరు. భీముఁడుగూడఁ దనతో నంత సేపు కడుఁజూతుర్యముతోఁ బెనంగిన యభయ సింగుని మెచ్చుకొనకపోలేదు.

ఇంతలోఁ బరమాదం ఉభయసింగుదురవస్థను జూచి మిగులఁ గ్రుద్దుఁడై భీమ దేవు నెదుర్కొనెను, అబూ సైన్యము లును దమప్రభువునకు బాసటయై నిలిచెను.అది చూచి భీముని సై న్యములుగూడ నతనికిఁ దోడై నిలిచెను. మరల మారసంగ్రామ మారంభమయ్యెను. కాని, కొంత సేపటికి భీమునిపరాక్రమమున కాగఁజాలక పరమార్కుడును నతని సైనికులును వెనుకకు మరలి పోవుచుండిరి. పృథ్వీరా జది చూచి తన సై స్యములను మరలించుకొని వచ్చి పరమారునకు భాసట యై నిలి చెను. ఈసాయము చేఁ బర్విడిపోవు నాబూ సైనికులు ధైర్యము తెచ్చుకొని మరల శత్రువుల నెదిరించిరి. పృద్వీరాజు మిగులఁ బరాక్రమించి ముందునకుఁ బోయి వాఁడి శరములచే భీముని సై నికులఁ దెళ్ళ నేయుచుండెను, విలువిద్య యం దతి చాతుర్యముగల యా రాజు నెదుర నిలువ లేక ఘూర్జర సై నికులు వెనుకకుఁ బాఱిపోవుచుండిరి. ఢిల్లీశ్వరుండును, నతని సైనికులును వారిని వెంబడించి తఱుమఁజొచ్చిరి. ఇంతలో భీముఁడు తన సైన్యములను ప్రోత్సాహించి మరలించి పృథ్వీ రాజు సేనలతో యుద్ధ మొనర్చుచుండెను. పృథ్వీరాజు తన దళముల పై ఁ గవియుచున్న భీమునిఁ జూచి చిర కాలమునుండి హృదయమున రవుల్కొనుచున్న కోప మొక్క పెట్టునఁ బ్రజ్వ లింపఁ బోయి వాని నెదుర్కొని వాడి బాణములచే నొప్పించి