పుట:Ecchini-Kumari1919.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

ఇచ్చి నీ కుమారి


యను సందేహము బాధించుచున్నది. ఇదంతయు నా కింద్ర జాలమువలె నున్నది. ఆలోచింపఁ బరమారుభటులు మారు వేషముతో నచ్చి మనలను మోసపుచ్చినారు. ఇచ్ఛినీకుమా రిని మేము మోసపుచ్చి తెచ్చినట్లు వారును మనల 'మోస పుచ్చి నన్నుగొనిపోయినారు. మన మిచ్ఛినిని బువ్వులలో బెట్టి పూజించుచున్నాము. వారు నన్ను జెట్టునకు విఱిచికట్టి పూజించినారు. మనకును వారికిని గలవ్యత్యాస మిది' అని యూమె చెప్పి యూరకుం డెను. భీముఁ డిది యంతయు విని చిత్త రువు బొమ్మవలె నిశ్చేష్టితుఁ డయ్యెను. సందేశహరుఁడు శత్రువని నిశ్చయించుకొ నెను. కాని, భూయాదుఁ డేమయి నాఁడో యతనికి బోధపడ లేదు. అతఁడు ద్వార పాలకులను బిలిపించి యిట్లు ప్రశ్నించెను.

భీ: -నిన్న రాత్రి మన పురమునుండి యెందఱు వెళ్ళినారు?

భ: . -ముగ్గురు. కాదు కాదు, నల్వురు.

భీ: రెవ్వరో యెఱుఁగుదువా ?

భ: సందేశహరుఁడు, రూపవతి, భూయాదుఁడు, నాల్గవ వాఁ డతని యనుచరుఁడు,

భీ: ఆవీరుఁడు భూయాదుఁడేనా ?

భ. -యోధ వేషముతో నున్న యాపురుషుఁడు భూయాదుఁడే యని తలంచితిని.