Jump to content

పుట:Ecchini-Kumari1919.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము 27

157


వెంబడించి పోవుచుంటిని, వారు దారి తప్పించి యీకొండ మీఁదికి నన్ను గొనిపోవసాగిరి. ఈ కొండమీఁదికిఁ గొనిపోవు చున్నా రే మని వారి నడిగితిని. ఇది యన్డిలపురమునకు దగ్గజ త్రోన యని వారు పలిరి. సత్య మే యనుకొని వారిసనుస రించి మఱికొంతదూరము నడచితిని. ఇంతలో నీ చెట్టును సమిపించితిమి. అపుడు నా వెనుక నడచుచున్న వాఁడు నన్ను గట్టిగా నొక దెబ్బకొట్టెను. నేను మొర్రో మొర్రో యని యేడ్వనారంభించితిని. భూయాదుని బిలిచితిని. కాని, భూ యాదుఁడు మాటాడ లేదు. మరల నే నతని గట్టిగాఁ బిల్చు చున్న సమయమున నాసం దేశహరుఁడు నన్నుఁ బడద్రోసి నోట గడ్డలు క్రుక్కెను. వారు మువ్వురును నన్ను గట్టిగాఁ దన్ని చెట్టునకు బంధించి నిర్దయు లై పోయిరి. భూయాదుఁడు నన్నుఁ గాచు నేమో యని యనుకొంటిని. కాని యత డేమియు నాకుఁ దోడుపడ లేదు, ఆసం దేశహరుఁ డెవఁడో పెద్ద మోసగానివ లె నున్నాఁడు, మహాప్రభూ ! భూయాదుఁ డేమయినాఁడో నాకుఁ దెలియదు. నాతో నడచిన రెండవ వాఁడు భూయాదుఁడు కాఁడేమో యని నా కిప్పుడు తట్టు చున్న ది. అతఁడే యైనచో నా కట్టి యాపద సంభవించి యుండఁ జూచి యూరకుండునా ? ప్రాణముపోయినను నతఁడు మన యెడ విరుద్ధముగా నడచువాఁడు కాఁడు. నా వెనుక వచ్చినవాఁడు భూయాదుఁడు కానిచో వేఱొకఁ డెవఁడై యుండును ? మనదుర్గము ప్రవేశింప వాని కెట్లు. వీలైనది ?