ఇచ్చనీకుమారి
భూయాదుఁ డని యనుకొంటిని.
నేను వారిని బ్రయాణము
నకుఁ ద్వర చేసితిని. వారును బయలు దేతీరి. దుర్గ ద్వారమును
సమీపించితిమి. ఇంతలో నన్డిలపురమునకుఁ గొనిపోవలసిన
వస్తు వింట మఱచుట చేఁ దెచ్చికొందునని చెప్పి నేను వెను
కకుఁ బోయితిని. నేను మరలినచ్చులోపల వారు దుర్గ ద్వార
మును దాఁటి యచ్చట నిలువఁబడిరి. తమయాజ్ఞ యగుట చే
ద్వార పాలురు వారి నడ్డ లేదు. నేను ద్వారమును సమీపించి
సం దేశహరుఁ డేఁడి యని రక్షకభటుల నడిగితిని. వారు
ద్వారమావల నీనిమి త్త మెదురుచూచుచున్నా రని చెప్పిరి.
అది విని నేను ద్వారము దాఁటగా నే సం దేశహరుఁడు నన్ను ఁ
జూచి 'అమ్మా! రా, రా; నీ నిమిత్తమే యెదురుచూచు
చున్నా' మని చెప్పెను. నేను నామూటను సం దేశహరుని
కిచ్చి నడవఁజొచ్చితిని. చీకటి దట్టముగా వ్యాపించి
యుండెను. అయినను జుక్కల వెలుతుకు చే దారి కొంచెము
గానవచ్చుచుండెను. సం దేశహరుఁడు ముందు దారి
చూపుచు నడచుచుండెను. తరువాత నేను నడచుచుంటిని.
నా వెనుక . భూయాదుఁడును నడచుచుండెను. "మేము పది
బారలదూర మేగునప్పటి కొక పురుషుఁడు మాకుఁ దార
సిల్లెను. అతఁ డెవఁడని నేను సం దేశహరు నడిగితిని. అనిల
పురమునకుఁ బోవు నొక బాటసారి యని యతఁడు బదు
లిచ్చెను. రాత్రిసమయమున మఱియొకబ్డు తోడుగా నుండిన
నిరపాయముగాఁ బోవచ్చునని తలఁచి సంతసించి వారిని
ముందుదారి