పుట:Ecchini-Kumari1919.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

ఇచ్చనీకుమారి


నట్లు వారందఱును మిగుల రభసముతో నే పోవు చుండిరి. వారిలో గొందఱకుఁ దత్కారణ మేమియో తెలియక పోయినను ముందు పోవువారి ననుసరించుచుండిరి. పది బారల దూరము పోఁగా నక్కడ పెద్ద చెట్టొకటి యుండెను. ప్రజలు దానిచుట్టును మూఁగి యుండిరి. ఒక రి నొకరు త్రోసికొని చెట్టువంక ఁ జూచుచుండిరి. క్షణకాలములో నే యాప్రదేశము ప్రజలచే నిండిపోయెను. భీమరాజు దుర్గమంతయుఁ జుట్టి వచ్చుచు జనులంత ప్రోవై యుండుటకుఁ గారణ మేమై యుండునో యని యరయుచుండెను. ఒక యువతి యా చెట్టున కంటఁగట్టఁబడి యుండెను. అది యింకను బ్రతికియే యుండెను. తాళ్ళతోఁ జెట్టునకు బంధించుట చే దాని కాలు సేతు లాడ లేదు. నోట గుడ్డలు క్రుక్కుటచే నది మాటాడ లేకుండెను. అది తన బాధ నంతను జూపుల చేత నే ప్రజ లకుఁ దెలుపుచుండెను. ప్రజ లాలస్యము చేయక వెంట నే దానిబంధములు విప్పివై చిరి. బంధనములచే నవయవములు నలఁగిపోయి బాధించుట చే నాయువతి నిలువ లేక భూమిపై గూలఁబడెను. ఆయువతి యెవ్వరు? భీమ దేవుని యనుగ్రహ మునకుఁ బాత్రు రాలగు రూపనతి. హారాజువలన విశేష గౌరవము నొందుచున్న రూపవతి కేమి, ఇట్టి దుర్దశ రా నేమి యందఱును విచారింపఁజొచ్చిరి. కాని, యేమి చేయుదురు? దాని బాధను దొలఁగింప లేరుకదా! వెంట నే దానిని భుజముల పై వైచికొని భీమ దేవు నెదుటఁ బెట్టిరి.