పుట:Ecchini-Kumari1919.pdf/154

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము 27

153


బాధించిన చోఁ బితృ భక్తిగల య రాజకుమారి తండ్రి బాధ లను దప్పింప నన్ను వరించిన వరింపవచ్చును. నీ వింటికి బోయి ప్రయాణమునకు సన్నద్ధవుకమ్ము' అని చెప్పి రూప వతిని బంపి వేసెను. అనంతరమున భీమ దేవుఁడు భూయాదుఁ ఢను నొక రాజకుమారుని బిలిచి యన్డిలపు రమునకుఁ బోయి మధుమంతుఁడు చెప్పినట్లు చేసి కార్యము సాధించుకొనిరమ్ము. ఈసం దేశహరుఁడును నీవును గలసి రూపవతిని నిర పొయ ముగా సన్స్టిలపురమునకుఁ జేర్పుం' డని యాజ్ఞాపింపఁగా నాతఁడు సం దేశహరుని సమీపించి కొంత సేపు సంభాషించి యింటికిఁ బోయెను, సందేశహరుఁ డచ్చట నే విశ్రమించి యుండెను.

ఇరు వ ది యే డ ప ప్ర క ర ణ ము

మో సము

సూర్యుఁ డప్పుడే తూర్పు కొండ శిఖరమునఁ జూప ట్టెను. అతని కిరణములు ముందుగా నున్నత ప్రదేశములందుఁ గుంకుమపూత పూయుచుండెను. జ్ఞానులు సంసారముక్తులై స్వస్వరూపము నొందినట్లు ప్రజలు నిద్రాముకులై చైతన్య మును వహించి నిజకార్యాసక్తులయి పోవుచుండిరి. ఇట్టిసమ యమున మధుమంతమున కొక తట్టుననున్న కొండ పైకి జను లొక్కరొక"రే పోవుచుండిరి. ఏదో యపాయము సంభవించి