పుట:Ecchini-Kumari1919.pdf/156

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము 27


మిగుల నలఁగిపోయిన పూవుదండవలెఁ గాంతి దక్కి వికృతా కారముతో నున్న రూపవతిని జూచి యత్యాశ్చర్యము సూచించుచు భీమ దేవుఁ డిట్లనియె. రూపవతీ! నీ కిట్టి యాపద గల్గించిన దురాత్ము లెవ్వరు? నిన్నిట్లు బాధించిన క్రూరు లెవ్వరు ! పూలదండ కఱకుదర్భ త్రాళ్ళ చేవ లె నీనంటి యోగ్యురాలిని, నీవంటి సుకుమారి నిట్లు బంధించిన కఠిన హృదయు లెవ్వరు? అన్దిలపురమునకుఁ బోయెడు నీ వీ చెట్టున కేల బంధింపఁబడితివి? సందేశహరుడేమయ్యెను? నీకు రక్షకుఁడుగా వచ్చిన భూయాదుఁ డేమయ్యెను? నీ విట్టి దురన స్థకుఁ జిక్కుచుండఁ జూచి యాకఠినాత్ముఁ డెట్లూరకుం డెను? నీనృత్తాంత మేమియో చెప్పు మనఁగా నది పొంగి పొరలి వచ్చుచున్న దుఃఖమును గొంచెము తగ్గించుకొని చెక్కిళ్ళయందుఁ గాలువలుగట్టుచున్న కన్నీటిని దుడుచు కొని చెదరిన కేశపాశమును మెలన ముడి వేసికొనుచు హీన స్వరమున నిట్లు చెప్పెను.

'ఓ మహా రాజా! నాదురవస్థ నేమని చెప్పుకొందును? ఇట్టి కష్టము లనుభవింప భగవంతుఁడు నానుదుట వ్రాయ నది యేల తప్పును ! నిన్న దమయొద్ద సెలవు దీసికొని వస్తువు లన్నియు సవరించుకొని భుజించి మన వారందఱుతోను జెప్పి జాము రాత్రి యగునప్పటికి సం దేశహరుఁ డున్న చోటికిఁ బోయితిని. వాఁ డెవ్వరితోనో భాషించుచుండెను. చీకటిలో రెండవ వాఁ డెవ్వడో నేను బోల్ప లేదు. కాని, యతఁడు