పుట:Ecchini-Kumari1919.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము 26


మహారాజా! దేవర వారి పూర్ణానుగ్రహమునకుఁ బాత్రులగు సేవ కులలో నోక్కడ నై నను నందులకుఁ దగినఘన కార్య మాచ రించి ప్రభుభక్తిని వెల్లడింప లేకపోయినందులకు విచారించు చున్నాను. ఇచ్ఛినీకుమారిని సాధించుటలో నే నమర సింహు నంతపని చేయకపోయినను గొంత చేయకపోలేదు. అయిన నేమి యందులకుఁ బదింతలు పెద్ద నేరము చేసితిని. అమర సింహుఁడు తమ కిమ్మని నా చేఁ బంపిన యుత్తరము శత్రు వులపాలఁ బడ వైచితిని. ఈ నా యపరాధమును సహింపుఁడు, మహాప్రభూ! ప్రస్తు తాంశమును జిత్తగింపుఁడు. ఈ సం దేశ హరుడు నాకుఁ బియమిత్రుడు. ఇతనిసాయమున నే శత్రువుల కారాగారమునుండి తప్పించుకొంటిని. దుస్సహ రోగ పీడితుఁడ నగుట చే నడచుటకు శక్తి లేక పలు పొట్లుపడి యేట్లో నాపురమును జేరుకొంటిని, నేను 'మొదట మధుమంతమున కే రాఁదలంచితిని. కానీ, యాబూ సైన్యము మార్గమధ్యమున నుండుటచే మరల నెట్టియిక్కట్లు మూడునో యని భయపడి యట్లు చేయ లేదు, కడకాలమునం దమ దర్శన భాగ్యము లభింపనందులకు విచారించుచున్నాను. నే నీరోగమునుండి విముక్తుఁడ నగుదునన్న నమ్మకము నాకు లేదు. మిమ్ము నీ కన్ను లతో మరలఁ జూతునన్న నమ్మకము లేదు. ఇవియే నా కడపటి నమస్కారములు. వెంట నే నా ప్రియురాలగు రూపవతి నంపుఁడు. మరణకాలమున నామెను అయినను