పుట:Ecchini-Kumari1919.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

ఇచ్చనీకుమారి


జూచిన చో నాకుఁ గొంతమనశ్శాంతి కలుగును. మఱియొక మనవి. ఈపురుషుఁడు - జై తపరమారునిశత్రువు. ఇతనికి విశ్వాసార్హుడయిన యొకవీరుని సాయముగాఁ బంపుదు రేని పరమారుని బంధించి తెచ్చెదనని చెప్పుచున్నాఁడు. ఆ రాజును గూడ జెఱ నుంచినచో దండ్రి దుఃఖము నరయ లేక యిచ్ఛిని మిమ్ము వరించుట కంగీక రించును. ఈరూపవతి యాబూరాజునకు మహాపకారము చేసినది. అది వారి బారి! బడకుండ నొక వీరుని సాయమిచ్చి పంప వేఁ డెదను. ఆ వీరుఁడే యితనితో గలసి పోయి పరమారుని సాధించి తెచ్చును.

ఇట్లు విన్నవించుపాద సేవకుఁడు,

మధుమంతుఁడు.

భీమరా జిట్లు చదివి 'ఓయీ, మధుమం తా! నీ ప్రభు భక్తికి మిగుల నానందించితిని. చావ సిద్ధముగా నుండియు. నా సౌఖ్యమున కుపాయముల నరయుచు నే యున్నావు'. అని ప్రశంసించి కంటికి మంటికి నేక ధారగా నేడ్చుచున్న రూపవతి 'యువతీ! విచారింపకుము. మధుమంతుఁడు దైవాను గ్రహమువలన రోగ విము క్తుఁ డగును. నీవుపోయి మందిప్పించి యుపచారములు చేయుదు.వేని నతఁ డవలీలగ నే యారోగ్య వంతుఁ డగును.విచారింపక యీ రాత్రియే నీవు బయలు దేరి యన్డిలపురమునకుఁ బొమ్ము. మధుమంతుఁడు చెప్పిన యాలోచనము నాకు నచ్చినది. పరమారుని బంధించి తెచ్చి నోదార్చి