పుట:Ecchini-Kumari1919.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

ఇచ్చనీకుమారి


పెట్టెనో చూడుఁడు. ఎట్టి చెడువార్త వినవలసివచ్చునో యని యడలుచున్నాను' అని స్త్రీ జనమునకు స్వభావసిద్ధ కన్నీటిధారలు కపోలములందుఁ గాలువలుగట్ట నేడ్చుచుఁ బలికెను.


భీమగా జామాటలు వీని జాలిపడి యేవోమాటలు చెప్పి యోదార్చుచుండ నాసం దేశహరుఁడు వచ్చి రాజు నకు నమస్కరించి నిలిచెను. రాజును, రూపనతియును నతని వికృతాకారమును జూచి గొప్ప యాపద యేదో తటస్థించియుండు నని యడలుచు సందేశహరునితో 'ఓరీ! నీ వెక్కడ నుండి వచ్చితివి? అన్దిలపురమునుండి యా? మధుమంతుఁడు పం పెనా? అతఁడు కుశలియే కదా! ” అని యాత్రముతో నడిగిరి. అతఁ డది విని 'మహారాజా! నన్ను మధుమంతుఁడు పంపియున్నాడు. అతఁడు కొన ప్రాణముతో నున్నాఁడు. ఇదిగో! నీయుత్త రమున నంతయు వాయించియున్నాఁడు. అతని భార్య రూపవతి యిచ్చట నున్నదఁట! అవసానకాల మున వచ్చి కంటఁబడి తృప్తినొందింపు మని యామితో జెప్పుమని యతఁడు నన్ను మఱిమఱి ప్రార్థించెను. ఇంతకంటే నా కేమియును జెప్ప లేదని పల్కి యుత్తర మిచ్చెను. ఆ మాట విన్నతోడ నే కెవ్వునఁ గేక వేసి యేడ్చుచున్న రూప వతి నూఱడించి యాయుత్తరమును విచ్చి రాచదువం దొడఁగెను.