పుట:Ecchini-Kumari1919.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము 25

145


ఇచ్ఛిని కొంచె మూరకుండి యతనియభిలాషము దీర్ప నిచో నతఁ డక్కడనుండి కదలఁ డని తలంచి యెట్లో యా పిశాచమును వదలించుకొనుట యే మేలని యతనిఁ జూచి “ రాజా! అస్త్ర విద్య పురుషులది. పురుషులు చేయుపను లొనర్చునపుడు పురుష వేష మే యుండవలెను. నా కట్టిదుస్తులు తెప్పింపుము' అని పలికెను.

భీ: __యువతీ ! నీవిట్లు యువతి వై యుండి విల్లెక్కు వెట్టిన పుజీ నాకు మిగుల దర్శనీయవుగా నుందువు, ఇచ్చి: అగుగాక నే నీ వేషముతో వింటిని దాల్పను.

భీ - పోనిమ్ము, నీ 'వన్నట్లే కాని' మ్మని పల్కి యొక భటుని చే దుస్తులు తెప్పించి యామె కిచ్చెను. ఆయిచ్ఛిని యావస్త్రములను గ్రహించి లోనిక రిగి ధరించి యీవలికి నచ్చెను, మీసములు రాని రాకుమారునివలె నున్న యిచ్ఛినిని జూచి రా జాశ్చర్యము చెంది “యువతీ ! నీవు పురుష వేషముఁ దాల్చినను నీరూపము నాకు మోహజనక మే యగుచున్నది. అచ్చముగా రాకుమారునివలె నున్నావు. లెమ్ము, వింటి నెక్కిడుము' అని పలికెను.

అనంతర మిచ్ఛిని వింటి నెక్కిడి బాణము సంధించి యతఁడు చూపినలక్ష్యములను సరిగా గొట్టెను. భీముఁ డామె నేర్పునకు సంతోషించి తనలో “ఈమె యిం తేనియు దప్పకుండ లక్ష్యమును భేదించుచున్నది. ఒకప్పుడు నా కేమయి