పుట:Ecchini-Kumari1919.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

ఇచ్చినీ కుమారి


నను ప్రమాదము సంభవించు నేమో ? మఱియుఁ బురుష వేష ముతో నీమే వింటిని దాల్చినప్పుడు నాకు సంతోష మే కాక భయముఁగూడ నంకురించినది. ఈమె సొమాన్యురాలు కాదు, ఈమె కోరిన ట్లాయుధములు చేతి కిచ్చి నేను జేంతనున్న చో సింగపుఁగొదమవలె నా పై కిలంఘించి ప్రమాదముఁ గల్గింపక మానదు. కావున, నే నిఁక జాగరూకుఁడ నై వర్తి పవలెను. అంతఃపురమున నున్నయీయువతి చెంతకు వచ్చినప్పుడు యుద్ధ మునకుఁ బోవ నట్లు సకలాయుధములను దాల్చి వచ్చుట యే 'మే లని తలంచుకొనుచు నచ్చోటు గదలిపోయెను.

ఇరువది యా ఱవ ప్రకరణము

ప్రతీ కా ర ము

తామరకొలఁకునడుమ నెట్ట తామర పూవువ లే సూర్యుం డాకాశ మధ్యమున వెలుఁగుచు క్షమ యను పేరు వహిం చిన భూ దేవి యోర్పును బరీక్షించుటకో యన మిడుఁగురుల నంటి కిరణములు లోకము పై బఱపుచుండెను. ఆ వేఁడిమిచే మిగుల సంతప్తు రాలయి భూ దేవి విడుచు చున్న నిట్టూర్పులో యనునట్లు వెచ్చనిగాడ్పులు వీచుచుండెను. ఆతీవ్రతకుఁ దాళ లేక ప్రాణికోటి చెట్లనీడలను, పొదరిండ్లలోను, గృహాం తర్భాగములందును, జలాశయములలోను, భూవివరముల లోను విశ్రమింపఁజొచ్చెను.