పుట:Ecchini-Kumari1919.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

ఇచ్చనీ కుమారి


భీ: సం దేహ మేమి? విహరించుటకు దివ్య సౌధములు, శయనించుటకు మృదుతల్పములు, కట్టుటకు దివ్యవస్త్రములు, తినుటకు మృష్టాన్నములు; ఇవి యన్నియు సుఖక రములా? దుఃఖకరములా?

ఇచ్ఛి: —మనస్సు స్వస్థముగా లేనప్పుడు దుఃఖకరము లే! సుఖమునకు మన స్సే కారణము కాని తక్కిన దివ్య సౌధాదులు కావు.

భీ: నీవు మనస్సు నేల పదిలపఱుచుకొనరాదు ?

ఇచ్ఛి: — ఇచ్చట నుండ నది నా కసాధ్యము.

భీ: మఱియెట నున్న సాధ్యమగును ?

ఇచ్చి: మా తండ్రి గారి గృహమున.

భీ : నిన్ను విడిచి యుండ లేను.

ఇచ్చి: —స్వసంతుష్టి కై యితరులను బాధించుట న్యాయమా?

భీ: బాధింపవలే నన్న తలంపు నాకు లేదు. నేను బాధింపను లేదు. డాని కేమి ! అది యట్లుండనిమ్ము, నీయస్త్ర విద్యావి శేషమును మఱియొక పరి ప్రదర్శించి నా కానందముఁ గూర్పుము.

ఇచ్ఛి:--నీ వానందింపకపోయిన నా కేమి ?

భీ: -నీ వట్లు చేయుదాఁక నే నీచ్చటనుండి కదలను. ఏమీ చేయుదువో చూచెదనుగాక !