పుట:Ecchini-Kumari1919.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

ఇచ్చనీకుమారి


ములను జిరకాలమునుండి వినుచు మనసారఁ బ్రేమించియు నా మెయను రాగ మెటు ప్రాకుచున్నదో తెలియక వెనుక దీయు చుండెనో యాకుమారి స్వహ స్తముతో నను రాగరసమును సవించుచున్న యట్టియు త్తరమును | వాసి దీనాతిదీనముగాఁ బార్థించుటయే కాక ధర్మస్థాపనము చేయ నుప దేశించు రా జందులకు విముఖుండగునా? పృథ్వీరాజు శరణాగతులను రక్షింపను, శత్రువులను శిక్షింపను, సనాతన ధర్మమును స్థాపింపను నెంతమాత్రమును జంకు వాఁడు గాఁడు. ఈసమయమున నతని హృదయాకాశమున నొక పూర్వవృత్తాం తము మేఱపువలె మెఱుసెను. తనతండిని జంపి తనతో దీజని వైర మవలంబించియున్న భీము నెదుర్కొని కసిదీర్చు కొనుట కంతకంటె మంచి సమయ మింక దొరకదని యతఁడు నిశ్చయించు కొనెను. భీముని వృత్తము స్ఫరింపఁగా నే యతని హృదయమునఁ బుట్టినక్రోధాగ్ని జ్వాలలకు ద్వారములో యనున ట్లతనికన్ను 'లరుణ కాంతులను గురియింపసాగెను. ఆయగ్ని జ్వాలలకు మీదుగా నెగయుచున్న ధూమ రేఖలవలె నొప్పుచుఁ గనుబొమలు ముడిపడఁ జొచ్చెను. తనయాత్మ నంటు కొనియున్న శాంతగుణము వదలించు కొనుటకోయన శరీ రము కంప మొందఁజొచ్చెను. వెంటనే యతఁ - డాతోరమును జేతికి బంధించుకొని సభ్యులను జూచి గంభీర భాషణముల నిట్లనియె. 'మంత్రులారా! సేనాధిపతులారా! హీతులారా! వెంటనే పోయి యాయువతినిఁ గాంచుట మన కవశ్యకర్త