పుట:Ecchini-Kumari1919.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము 25

139


వ్యము. దానివలన మన కెన్ని యో లాభములు గలవు. శరణాగతురాలిని రక్షించిన వార మగుదుము. రాజపుత్రా చారమును బాటించిన వార మగుదుము. సనాతన ధర్మమును స్థాపించిన వార మగుదుము. హృదయశల్యమువంటి భీముని జయించి కసిదీర్చుకొన్న వార మగుదుము. పిత్రూణమును దీర్చుకొన్న వార మగుదుము. భీమునిఁ బరిమార్చుటకు దగినసమయ మెప్పుడు లభించునా యని యోజించుచుండ దైవము నా కిట్టి యుక్తసమయమును ఘటింపఁ జేసెను. కావున వెంటనే రణ భేరుల మాయింపుఁడు, ఆయుధములను ధరించి సేనలను గదలింపుఁడు' అని యాజ్ఞాపించి సభ చాలించెను.

ఇరు వ ది యై ద వ ప్రకరణ ము

ప్రతీకారము

పృథ్వీరా జపార సైన్యములతో మధుమంతమునకు సమీపముగా - నాబూ సై న్య నివేశమున కొకతట్టు విడిసి యుండెను. జైతపరమారుఁడు పృథ్వీరాజున కెదురుగా బోయి యెక్కుడుగా గౌరవించెను. పృథ్వీశ్వరుఁడును పరమారుఁడొనరించినమర్యాదలకు మిగుల సంతసించెను. అపుడు పరమారుఁడు పృథ్వీ రాజుతో " రాజేంద్రా! నీవు సైన్యస మేతుఁడవై మాకుఁ దోడుపడ వచ్చినందుల కెంతయు సంతసించుచున్నాము. 'ఇఁక భీముని వలన మా కెంతమాత్ర