పుట:Ecchini-Kumari1919.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము 24

137


శత్రువుల చేఁ బీడితయగుచున్న రాజకుమారిక తన్ను రక్షింప సమర్థుఁ డైన యొక రాజసత్తముని కొక పట్టుతోరమును బంపి శరణు జొచ్చుటయు, నారా జాతోరమును జేతికి బంధించి కొని శత్రువుని జయించి యాకన్యకను విడిపించుటయు రాజపుత్రా చారము. ఆ యాచారము చేత నైనను నేను రక్షింపఁదగిన దాననే ! మనక్షత్రి యాచారమును బాటింపకున్నను శరణా గత నగునన్ను విడుచుట పాడిగాదు. శరణాగత రక్షణము మీవంటి యుదార పురుషులకు విహితకృత్యము గదా ! మఱియు, నేను పాలవంటి క్షత్రియవంశమునఁ బొడమిన దానను. హిందూ యువతిని, ఇట్టి నన్ను జైనమ తావలంబి యగు యొకడు బలాత్కరించి వరించి ధర్మసంక్షయము చేయఁ జూచుచుండ మీవంటి ధర్మజ్ఞులు నాధర్మవ్య త్యాసమును దొలఁగింప సమర్థులయ్యు నట్లు చేయకపోవుట న్యాయము కాదు. కావున, రాజేంద్రా ! ఒక కన్నియను రక్షించుటకై బహుప్రాణనాశము గల్గించు యుద్ధమున కెలపూనవలయు సని యోజింపక సనాతనమగు ధర్మమును స్థాపించుటకు బద్ధకంక ణుఁడ వై శత్రువులం దునుమాడి నన్ను రక్షింపుము.

ఇట్లు

,

మీ దాసురాలు,

ఇచ్ఛినీకుమారి,

ఆయు శరమును జదువుకొనుచున్నవుడు పృథ్వీరాజు నకుఁ గల్గినయానందమునకు మేర లేదు. ఏయువతీమణి సద్గుణ -