పుట:Ecchini-Kumari1919.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

ఇచ నీకుమారి


దమకులుంబమునందున్న ప్రేమకును మెచ్చుకొనుచు మరల జెట్టు వైపు చూచెను. కాని, వెనుక టి చోట నెవ్వరును గన్పడ లేదు. ఇచ్ఛినీ కుమారి కొంత సేపేమియో యాలోచించుచు నందు విహరించు తన్ను వెదకుకొనుచువచ్చిన వకుళను గూడి తనమందిరమున కరిగెను.

ఇరువది నాల్గవ ప్రకరణము

సందేశము

తన పినతండ్రి యగు కరుణ రాజు ప్రతాపసింహుని, నాతని తమ్ముని నిష్కారణముగాఁ జంపె నన్న విచారము పృథ్వీ రాజును సంతతమును బాధించుచుండెను. ప్రతాప సింహాదులు చేసిన నేర మేమియును బై కిఁ గనఁబడ లేదు' కరుణ రాజు చూపిన యపరాధము ప్రాణములను దీయఁదగి నంతది కాదు. కావునఁ, గరుణ రాజు చేసినది మిగులఁ గ్రూర కార్యమనుటకు సందియము లేదు. కార్యము మించిన పిమ్మట విచారించిన నేమి ప్రయోజనము ? .చేతులుగాలిన పిమ్మట నాకులు పట్టుకొనిన లాభమేమి ? ఇఁకఁ గరుణ రాజును నిం దించినను, లేక సంహరించినను జచ్చిన ప్రతాపసింహాదులు బతికి రారు గదా ! ఆశ్రితులఁ జంపించె నన్నయపవాదము తనకుఁ బోదు గదా ! ఇక నేమి చేయుట ! పృథ్వీరా జీవిష యమై యాలోచించి యిఁక మిగిలిన వారి నైనను దగువిధమున