పుట:Ecchini-Kumari1919.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము 24

135


నాదరించి వారిభ్రాతృ దుఃఖమును దొలఁగించి సంతసింపఁ జేసి నచోఁ దనసన్నిధిని వర్తిల్లిన క్రూర కార్యమునకుఁ గొంత శాంతి కలుగునని మనస్సులో నిశ్చయించి పలుమాఱు వారి యిండ్ల కరిగియుఁ బ్ర త్యేకముగా వారిని దనయింటికిఁ బిలిచి గౌరవించియుఁ, బెద్ద యుద్యోగముల నిచ్చియు వారిని బలు విధముల నాదరించి సంతుష్టులనుగాఁ జేసెను. వారును రాజు చేయుచున్న గౌరవమువలనఁ గ్రమక్రమముగా భ్రాతృదుఃఖ మును మఱచి సంతుష్టు లైనట్లే పైకి వర్తించి యరమర లేకుండ నా రాజసత్త ముని గొలుచుచుండిరి.

ఒక నాఁడు పృథ్వీరాజు నిండుకొలువుం డెను. సభామం డపము జనుల చేఁ గిక్కిఱిసియుండెను. అంత ద్వారపాలకుఁ డొక పురుషుని రాజసన్నిధిని సిలువఁ బెట్టి వెడలిపోవ వాడు రాజునకు నమస్కరించి యొక్క యుత్తర మతని పాద సన్నిధిని బడ వైచెను. రాజు దాని నందుకొని యిట్లు చదువుకొనెను.

రాజేంద్రా! నేను మిమ్మును విధిప్రకారముగాఁ బెండ్లాడక పోయినను జిరకాలమునుండి మోసద్గుణములను వినుచు, మీపాద సేవ నొనర్చుటకే మదిలోఁ గాంక్షించుచు, మీ సుందర రూపము నే నాహృదయపీఠమున నిల్పి పూజించుచు, నాప్రాణముల కంటెను నెక్కుడు ప్రియముగాఁ జూచుకొను. చున్న మిమ్మును 'ప్రాణవల్లభా' అను పవిత్రాక్షరములతో- కాదు, అమృతమయాక్షరములతోఁ బిలిచి యానందించుట కాజ యిండు. ఓ ప్రాణవల్లభా ! నే నుత్త మమగు పరమారు