పుట:Ecchini-Kumari1919.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము 3

133


రాకముం దే వచ్చి యీదుర్గమును సాధించి నిన్ను గొని పోవ లెనని యనుకొన్నాము. కాని, దైవము మాకోర్కి- వ్యర్థ ము గావించెను.మే మిచ్చటికి వచ్చినప్పటినుండియు నెట్లయినను నీదర్శనము చేసి మావృత్తాంతము నీకుఁ దెలుప వలెవని యెంత యో ప్రయత్నించితిని. కాని, భీముని సైనికులు రాకాసులవ లెం గాచి కొనియుండుట చే దుర్గప్రవేశము నా క సాధ్యమయ్యెను. అందుల కేదైనను పాయ మాలోచింపవ లె నని తలంచి యీ పర్వతము నెక్కి యీదుర్గమంతయు నవ లోకించుచుండ నీవు నాకుఁ గాన వచ్చితివి. 'ఒరులకుఁ జొర శక్యము కాని యీదుర్గమందున్న నీకు మావృత్తాంతమును దెలుపు టెట్లని యాలోచించి తుద కీయుపాయమును బన్ని అపార సైన్యములతో గూడిన నీభీముని జయించుట యసాధ్యము, మఱి నిన్నీ చెఱనుండి యెట్లు తప్పించుటయో మాకుఁ దెలియకున్నది, ఈసమయమున మాయోపాయము తప్ప వేటొకటి పని చేయదు, బుద్ధిమంతురాలవు గదా ! నీ వేదైన నుపాయము చెప్పుము. నీకస్త్ర విద్యయందు మిక్కిలి నేర్చుగలదు. కావున, నీవును నావ లెనే బాణమునకు నీయభి పాయముఁ దెలుపును త్తరమును గట్టి నాకుఁ బంపుము. నేను రేపు మరల వచ్చెదను. అప్పటికి నీవు సిద్ధురాలనై యుండ వలయును.

ఇట్లు చదువుకొని యిచ్చిని యమి తానందము నొంది యీశ్వర భట్టుబుద్ధిని శారదత్వమునకును, సమయస్ఫూర్తి కిని,