పుట:Ecchini-Kumari1919.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇచ్చినీకుమారి

132


టెగయుట బాణము. ఇది నాకుఁ దగిలిన చోఁ దప్పక ప్రమాదించునే! వాడెవఁడో లక్ష్యశుద్ధిగలవాడును, విలువిద్యయందు నేర్పుగలవాఁడును, దూరస్థములగువ స్తువుల నేయఁ జాలుబలము గలవాఁడును గాని సామాన్యుడు కాఁడు,కాక పోయిన నీ బాణము నింత నిరపాయముగా నా చెంతఁబడున ట్లెగయుట. యసంభవము. మఱియు, వానికి నన్నుఁ గొట్టుఁదలం పున్నట్లు తోఁపదు. కానిచో, నంత లక్ష్యశుద్ధిగలవాఁ డాశరమును నాపైఁ బఱప లేక పోవునా ! పూర్వ మర్జునుఁడు శత్రుబలము సడుమనున్న భీష్మ ద్రోణులను సమీపించి నమస్కార కుశలప్రశ్నములు చేయ వలను పడక దూరమునుండి యె బాణ ములు పఱపి వారిని గౌరవించె . నని వినియున్నాను. అట్లే వీఁ డెవఁడో నాశుఁ గుశలప్రశ్న బాణములను బఱపుచున్నా డేమో!' అని యనుకొనునంతలో మఱియొక బాణము రివ్వున వచ్చి యామె చెంతఁ బడెను. ఇచ్చిని దాని కచ్చెరువందుచు దానిని దీసికొని పరిశీలింప దాని కొక యుత్తరము బంధింపఁ బడియుండెను. దాని నాత్రతో దీసికొని తనలో నిట్లు చదువుకొనెను.

'కన్యకామణీ! నీకు సంభవించిన కష్టమునకు మే మెంత యును విచారించుచున్నాము. అందులో నీతండ్రి దుఃఖము నకు 'మేర లేదు. ఆనాఁడు బిచ్చగాని వేషమున , వచ్చి నీజాడ లను నీజనకునకుఁ దెలియఁ జెప్పి నీవిచ్చినహారము నతనికి జూపి కొంతదుఃఖమును దగ్గించితిని. భీమ దేవుఁ డచ్చటికి