పుట:Ecchini-Kumari1919.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రక ర ణ ము 23

131


డామె ఎవరో మనుష్యులు యే దేనిమృగము గనఁబడిన దానిని వేటాడుచుఁ గాలము గడపుచుండెను.

ఒక నాడామె యా సౌధశిఖరమునఁ గూర్చుండి మృగముల సరయుచుండెను. ఆమె యాయరణ్యమును దదేక దృష్టితోఁ జూచుచుండఁగా నొక చెట్టుకొనయం దొక తెల్లని వస్తువు గానవ చ్చెను. 'ఆవస్తు వేమైయుండును? ఆ చెట్టుకొన యం దటుండుటకుఁ గారణ మేమి?" అని ప్రశ్నించుకొను చుండ నావస్తు విట్టటుఁ గదలనారంభిం చెను. అది యామె కొక తెల్ల పతాక వలెఁ బొడచూపెను.

తెల్లని పతాక పట్టుకొని యా చెట్టున నున్నా రని గ్రహించి యామే యాశ్చర్యపడుచుండ నింతలో నొక పురుషుఁడు గాన వచ్చెను. ఆమె యటనుండి కదలక మెదలక యాపురుషు నట్లే చూచుచుండ పొడువగు నొక వింటి నెక్కిడి యందు బాణమును సంధించు చుండెను. 'ఆహా! ఏమి! వీఁ డెవఁతో, విలున మ్ములు దాల్చియున్నాఁడు. మఱియు, వింట బాణము ' సంధించుచున్నాఁడు. నన్నే గురిగాఁ జూచి కొట్టు టకుఁ బ్రయత్నించుచున్నట్టు లున్నది. వీఁ డెవఁ డై యుం డును? నిరపరాధనగు నన్ను వీఁ డెందులకుఁ గొట్టును? ఏమి జరుగునో చూచెదనుగాక! ' యని యామెయు నట్లే యుండెను. ఇంతలో నొక బాణము రివ్వున వచ్చి యామెకు సమీపముగా బడెను. ఆమె యాబాణమును దీసికొని ఇ దేమి? వింతగా నున్న దే! ఇది మిగుల వాడి