పుట:Ecchini-Kumari1919.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరు వ ది మూడవ ప క ర ణ ము

అశ్ర కౌశలము

మధుమంతమున కొక పక్క గోటగోడనంటి పెట్టు కొని యున్న తమగు నొక కొండ గలదు. దానికింది చఱియ లిసుముచల్లి నరాలనంత దట్టములగు వెదురు టడవులచేఁ గప్పఁ బడియుండుటవలన గాలికైనను జొరఁ దరముగాకుం డెను. అట్లుండ మనుష్యు లాయరణ్యమును భేదించుకొని యాకోట నెట్లును ముట్టడింపఁ జాలరని నమ్మకముండుట చే సైన్యములు తక్కినమూఁడుదిక్కులందునుమాత్రమే నివసించి గాపాడుచుందురు. ప్రస్తుతము భీముని సై న్యములుగూడ న దే విధమునఁ గాచికొని యుండెను. కైలాసశిఖర మను సౌధము మిగుల నున్నతమైన దని చెప్పితిని. అది యాప్రక్కనున్న పర్వతమునకు సోదరునివ లెం గన్పట్టుచుండెను. దానియు పరిభాగముననుండి యాపర్వతా రణ్యము నెల్లను గన్ను లవిందుగాఁ జూడవచ్చును. మఱియు, నటఁ గూర్చుండి యాకొండచఱియలయందుఁ దిరుగుమృగము లను లక్షించి వేటాడుట కనువగుట చే నా సౌధశిఖరము మృగయావినోదమునకుఁ దగినస్థలమని కూడఁ జెప్పవచ్చును. నాడు భీముఁడు విలునమ్ము లచ్చట నే విడిచి పోయి నప్పటినుండియు నిచ్ఛినీకుమారి వానిని దాల్చి, యాసౌధోపరి భాగముననిలిచి యాయరణ్యమును జక్కఁగా బరిశీలించి