124
ఇచ్చినీ కుమారి
ప్రియురా లగు యిచ్ఛినీకుమారి మనస్సున దుఃఖించి తన మనోరథ మెక్కడ వ్యర్థముగావించునో యనెడు భీతిగల యతఁ డాసాహసమున కెట్లంగీకరించును ? వెనుకటి సంభాషణమునఁ దా నతని వరింపనట్లు స్పష్టముగా నిచ్చిని చెప్పినది. అయినను భీముఁడు నిరాశుఁడు గాలేదు. లేఁబాయపు బాలికలు సిగ్గు భరమునఁ దన్నుఁ గోర వచ్చిన వారిని మొదటి పర్యాయమున నిరసించినను గ్రమముగా దర్శన సంభాషణాదులచే మచ్చిక పడి యాపురుషునం దనురాగము వహించి పెండ్లియాడక మాన రని యతనియభి ప్రాయము.
భీమ దేవుఁ డొకనాఁ డిచ్ఛినీకుమారిని జూడ నామె మందిరమున కేగెను. కాని, యామె యచ్చట లేదు. వకుళతో గూడఁ గైలాసశిఖర మనెడి సౌధ మెక్కి తనతండ్రిగారి సైన్య ములను, భీముని సై న్యములను జూచుచుండెను. భీముఁ డది యెఱిఁగి మెల్ల మెల్ల నా సౌధమునకుఁ బోయెను. ఇచ్చిని భీమ దేవు నల్లంత దూరముననే చూచి మన స్సులో నిందించుకొనుచు మేల్ముసుఁగు సవరించుకొని వకుళ చాటున నిలువఁబడెను. అతఁడు వారిని సమీపించి 'వకుళా' ! ఇట 'నేమి చేయుచున్నారు ? ' అని యడిగెను.
వకు: మహాప్రభూ ! అమ్మగారు చల్ల గాలికై వచ్చి. నారు. ఆమె వెనుక నేనును వచ్చితిని,
భీమ: అంతియేనా ? లేక , ' యాబూగడ ఘూర్జర సైన్యముల బలాబలములఁ బరిశీలించుచున్నారా ?