పుట:Dvipada-basavapuraanamu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

31

వడువునఁ బుడమిపైఁ బడి బోరగిల్లు; 830
నిల [1] మఱపడ్డ నిర్మలశివభక్తి
తలయెత్తువడువునఁ దాఁ దలయెత్తు ;
నరు దొందఁ బద్మాసనానీనవృత్తిఁ
బొరి నభ్యసించుపొల్పునఁ గూరుచుండుఁ ;
బూని ద్వితీయశంభుం డను నంది
నే నను భావన నిలఁ దోఁగియాడు;
నా వీరమా హేశ్వరాచార మెల్ల
బ్రోవయి నిల్చినపోల్కి నిల్చుండుఁ ;
గడఁకతో నాదిమార్గము దప్పకుండ
నడుగిడులీలఁ దప్పడుగులు వెట్టు ; 840
మలహరుఁ బేర్కొనుమాత్ర గద్గదము
లలరుకై వడిఁ దొక్కుఁబలుకులు వలుకు
బల్లిదు ల్మాశివభక్తులే యనుచుఁ
గ్రేళ్లువాఱుచు నాడుక్రియఁ బాఱి యాడు ;
నంత-వినోదంపుటాట ప్రాయమున
సంతతంబును శివార్చన మాచరించు ;
బుద్దు లెఱుంగు లేఁబురులు ప్రాయమున
సిద్ధంబు భక్తుల శిపునిగాఁ దలఁచు ;
సర్వజ్ఞుఁ డైన వృషభమూర్తిగాన
సర్వవిద్యలు సహజంబ పాటిల్ల 850
గతభక్తియుక్తుఁ డై గర్భాష్టమమున
సుతు నుపనయనంబు శుభముహూర్తమునఁ
జేయుదు నని తద్దఁ జిడిముడిపడఁగ,
నాయెడ బసవఁ డి ట్లనియెఁ దండ్రికిని ,

—: బసవేశ్వరుఁడు వడుగు వల దని తండ్రితో వాదించుట :—


“వడు గని యిది యేమి గడియించె దీవు ?
జడుఁడ వెట్లయితి వీశ్వరునిఁ గొల్చియును ?
బరమాత్ము గురునిగాఁ బడసి దుర్నరుల

  1. మఱుగుపడ్డ : తార్మాఱయిన.