పుట:Dvipada-basavapuraanamu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

బసవపురాణము

గురు లని కొలుచుట నరకంబు గాదె ?
గతపూర్వజన్మసంస్కారుఁ డై తలఁప
వితతద్విజత్వంబు వతితంబు గాదె ?860
నిర్మలగురుకృపాన్వీతజన్మునకుఁ
గర్మజన్మంబు దుష్కర్మంబు గాదె ?
యగ్గురుపాదంబు లర్పించునతని
కగ్గిలో హవి వేల్చు టది దప్పు గాదె ?
మలహరాత్మక మగు మంత్రంబుఁ గఱచి
పలుమంత్రములు గొనఁ బాపంబు గాదె ?
శూలి భక్తుల కెత్తుకే లది [1] త్రాటి
మాలల కెత్తుట మఱి తప్పు గాదె ?
కర్మపాశంబు లొక్కటఁ దెగ నీల్గి
కర్మంబుత్రాళ్ళు దాఁ గట్టుకోఁ దగునె ? 870
రుద్రాక్షభసితాదిముద్రలు దాల్చి
క్షుద్రముద్రలు దాల్ప, గూడునే చెపుమ ?
యీరీతిఁ [2] ద్రాటికి దూర మై యున్న
వీరమా హేశ్వరాచారదీక్షితుని
నిర్మితోభయకర్మనిర్మూలు నన్నుఁ
గర్మాబ్ది ముంచుట ధర్మమే నీకుఁ?
గచ్చఱఁ గన్నులఁ గానవు గాక
వచ్చునే బసవవి వడుగు సేయంగ
బ్రహ్మశిరోహరుఁ బ్రమథైకవంశ్యు
బ్రహ్మవంశ్యుం డని భావించె దెట్లు ? 880
జాతిగోత్రాతీతు సద్గురుజాతు
జాతిగోత్రక్రియాశ్రయుఁ జేసె దెట్టు ?
లకులస్థుఁ డై యున్న యభవుని భక్తు
నికి నేకులం బని నిర్ణయించెదవు ?
కావున నెన్నిమార్గములను వడుగు

  1. కర్మపాశబద్ధు లయిననీచులు.
  2. కర్మపాశమునకు.