పుట:Dvipada-basavapuraanamu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

బసవపురాణము

భక్తిఁ బ్రణామ మేర్పడ నాచరించి,
యిమ్ముల సింహాసన మ్మిడి, తత్క్ష
ణమ్మ విభూతి వీడ్యమ్ము లర్పించి,
పాదోదకంబులు వట్టి మైఁ గడిగి ,
బూది ఫాలంబునఁ బూసి పైఁ జల్లి.
పంచమహావాద్యపటలంబు లులియ
నంచితాగణ్యపుణ్యాత్ముఁ దత్సుతుని
బసవ నామం బిడి, పతియును సతియు
నెసక మెక్కఁగ నున్నయెడ - గుమారుండు 810
వెనుక జీఁకటి యుండఁ దన కేటితేజ
మనుగతి దీపంబుఁ గనుఁగొని నవ్వు ;
సన్నుతలింగప్రసాదమగ్నతన
యున్నట్లు చనుగుడ్చు నూరక యుండు ;
శివసుఖామృతమును జేఁ గ్రుమ్మరించి
చవి సూచుమాడ్కి హస్తము లారగించు ;
శినపదధ్యాననిశ్చేష్టితావస్థఁ
దవులుచందంబునఁ దా వెఱఁ గందు;
బిలిబిలిసంసార మిలఁ బాఱఁ దోలి
చెలఁగి యాడెడుగతిఁ జేతు లాడించు; 820
మాయాప్రపంచంబు డాయంగనీక
పాయఁ దన్నెడురీతిఁ బాదంబు లార్చు ;
వడి మొయిఁ దనపూనివచ్చినపనులు
దడ పయ్యె ననుచు నుల్కెడుభంగి నులుకు ;
భవుఁ బాడ నానందబాష్పంబు లొలుకు
పవిది నేడుచుఁ గనుఁగవ నశ్రు లొలుకు ;
భవబాధలకు [1]నగపడి మొఖవెట్టు
భవుల కు య్యాలించుభాతి నాలించు;
నొడయలయడుగులఁ బడి మొఱ ల్వెట్టు

  1. లోనయి.