పుట:Dvipada-basavapuraanamu.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

239

యనుచు బోయలు లేచి కనుకనిఁ బలుకఁ
గనుఁగొని బసవయ్య గన్నుల నగుచు
“వట్టియాకులు గాలి వడిఁ దూలుఁగాక
మెట్టలు దూలునే యెట్టిగాడ్పుసను ?
బెండ్లు దేలెడిఁగాక పేరేట నైన
గుండ్లు దేలునె మఱి తం డ్లవియేల ?
బలువునఁ గొన హరిబ్రహ్మాదులకును
గొలఁది గా దనిన మీకొలఁదియే తొరల ?
వలదు మీ రెంతటివారు గావునను
చల ముడ్గి తొలగుఁడు తెలివిడిఁ గొనుఁడు ! 350
శైవశివాలయస్థానంబు దక్క
నేవీట నేనాఁట నిలఁ దొల్లి నేఁడు
నెన్నఁడే వీరమాహేశ్వరు లిండ్లఁ
గొన్న చోటులు దెల్పికొనుఁడ ! యిచ్చెదము ;
యారయ మును శైవు లై నను నేమి
వీరమాహేశ్వరాచారు లైరేని
గనుకనిఁ బ్రాణలింగప్రసాదంబుఁ
గొననిత్తు రే మీకుఁ ? గుటిలాత్ములార !
కోలాస లేల పైఁ గొసరఁ గుంచంబు
గూలఁబడ్డట్లగుఁ గూడని మ్మనిన 360
నేదియు నేల మీ కిష్ట మేనియును
మాదేవునకును శ్రీమన్మహేశునకు
బాలచంద్రప్రభాభాసురాంకునకుఁ
గాలకాలునకు మానీలకంఠునకు
సర్పకుండలు నకు సంగమేశ్వరున
కర్పింతుఁ గాలకూటాదులు నేడుఁ ;
రండ ! ప్రసాదంబు గొండ యిచ్చెదము;
పొండ ! యింతకుఁ జాలకుండిన" ననుడు
“నక్కటా బసవయ్య ! యందఱ మమ్ము