పుట:Dvipada-basavapuraanamu.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

బసవపురాణము

నెరియుదు రని శ్రుతు లెందును వినరె!
శ్రీగురుక రుణానురాగ ప్రసాద
మాగమవిధ్యుక్త మగు ప్రసాదంబు
సుప్రసన్నానంద శుద్ధ ప్రసాద
మప్రతర్క్యాది లింగప్రసాదంబు
పరమపవిత్ర సంపత్ప్రసాదంబు
స్థిరభవరోగౌషధీ ప్రసాదంబు
సత్యప్రసాదంబు నిత్యప్రసాద
మత్యుత్తమోత్తమం బగుప్రసాదంబు 320
గరళకంధరు కృపాకలిత ప్రసాద
మరుదగుసంగమేశ్వరు ప్రసాదంబు
మలదేహులకు మీకుఁ దలమె భోగింప ?
మలహరుభక్తుల యిలుపుట్టువృత్తి
పూని లింగ ప్రసాదానూనసుఖము
మానవులకుఁ బొందఁగా నెట్లువచ్చు ?
[1]నేనుఁగుప న్నగునే గాడిదలకు ?
నేనాఁటఁ గన్నులఁ గానరు గాక !
యిచ్చుచోఁ గెడపితిమే ప్రసాదంబు
నిచ్చినకొన్నచో టెన్నఁడుఁ గలదె ? 330
యిది యేల వెడగథ లిన్నియుఁ బన్న :
గుదగుదపడక నెమ్మది నుండుఁ డనిన
“వారాణసి గయఁ గేదారంబునందు
సౌరాష్ట్రమునను దక్షారామమునను
శ్రీగిరియందును సేతుపురోగ
మాగమస్థానంబులం దెల మాకుఁ
జెల్లఁగ మీ రెట్లు చెల్లఁగనీరు ?
బల్లిదమైన మాప్రాణంబులైన
విడుతుముగాక మా[2]మడిగూటివృత్తి
విడుతుమే యిది యేమి విపరీతవ త్తి" 340

  1. ఏనుఁగుపైఁ గట్టు చౌడోలు.
  2. ప్రసాదము గొను వ్యాపారము.