పుట:Dvipada-basavapuraanamu.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

బసవపురాణము

నొక్కపెట్టునఁ జంప నొండుపాయమునఁ 370
జాలక యిదిమేలు మేలు వో శృంగి
కాలకూటంబు మ్రింగంగఁ బంచెదవు !
నలి దీటుకొనఁగఁ బ్రాణంబుఁ గల్గినను
బలుసాకు దిని యైన బ్రదుకంగ వచ్చు ;
నద్దిరా తాఁ జచ్చి యది గుడ్తు రెవరు?
దొద్దవో బసవయ్యతోడివాదంబు ;
వడిఁ గొఱుకున కేఁగి [1]బడిగంటఁ జావఁ
బడిన మూషకములభంగి వట్రిల్లె :
నేచి కొల్లకుఁబోయి యెదురెదురు గాను
బై చీర గోల్పడ్డభావన దోఁచు ; 380
జాలిఁబడి [2]కనకసాములు దమక
వేలిచికొన్న యావిధ మగుఁ దమకుఁ :
బగవారిబిడ్డల నగవులఁ జంపు
పగిదిఁ జేసిన పోదు బసవనమంత్రి !
యీరసం బిదియేల ? యే మింతవెఱ్ఱి
వారము గామువో ! వలవ దిన్నియును;
ధర భక్తు లెవ్వరే హరునకుఁ దొల్లి
గరళ మర్పించుట గలదేని యిమ్ము;
తవిలి చెప్పుము : ప్రసాదం బని విషము
నెవరేని మునుగొన్న నేముఁ గొనెదము ; 390
మేలిప్రసాదంబు మ్రింగ మీపాలు
కాలకూటంబు మాపాలె? నేఁ డింక
నె ట్టిచ్చెదయ్య మాకీశుప్రసాద
మట్టవుఁబో విష మనియె యిచ్చెదవొ ?
నీవకో విషములు దేవుని కిచ్చి

  1. బడిగల్లు = పందికొక్కులఁ జంపుట కేర్పడిన ఱాతిబోను.
  2. శత్రువును జంపుటకై యభిచారహోమము చేసి యం దుద్భవించిన మారణశక్తి చే శత్రువునికి మాఱు తాను హతుఁడైనవాఁడు.