పుట:Dvipada-basavapuraanamu.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

229

వసుధేశ్వరునకు నవార్యవీర్యుండు
బసవఁడు సద్భక్తిపండితుం డనియె :
"మనుజేశ ! గొడగర మాచలదేవిఁ
జెనసి యుత్తమవంశ్యఁ జేసెద మనుచు
స్వర్ణధేనువులోన సతి నుంచి మునుఁగ
నిర్ణిమిత్తమ పాలు నిండఁగఁ బోసి 60
యా పోయెఁ బూర్వాశ్రయం బని తార
యాపడఁతికి మ్రొక్కి యంతటఁ బోక
యంగద నట్టిగ్రామాంత్యజురాలి
యెంగిలిపా ల్ద్రావి రేకంబు లేక ;
యది యేల వేయును ననఁ ? గథ లందు
[1]గదుగదుకేమి యక్కనక ధేనువును
వండఁ దరినమాడ్కి ఖండము ల్గాఁగఁ
జెండుచుఁ దమలోనఁ జేవ్రేసికొనుచు
బనత సోమాదుల బలగంబుపాలు
వెనుకచట్టలు సతుర్వేదులపాలు 70
కోలెమ్ము దా నుపాద్దేలయ్య పాలు
వాలమ్ము బ్రహ్మవిద్వాంసులపాలు
బరులు షడంగులపాలు మున్నుడుక
లురము సై తము ప్రభాకరభట్లపాలు
సమపొట్ట సన్నపుటెముకలుఁ బ్రక్క
టెముకలు వ్యాకరణమువారిపాలు
తోలఁకుజల్లియుఁ ద్రివేదులవారిపాలు
బలుడెక్క సిఱుడెక్క వాళ్ల మిక్కిళ్లు
పరదేశి విద్యార్థిపాలంచు నిట్లు
చెరలుచు గోహత్య సేసినయూర 80
మాలల యీ త్రాటిమాలల పచ్చి
మాలలమాటలు వోలునే వినఁగ?

  1. సందేహము, జంకు.