పుట:Dvipada-basavapuraanamu.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228

బసవపురాణము

వినఁ జెప్పకున్నఁ దజ్జననాథు పాప
మనఘ ! పురోహితులను నవశ్యమును
బొందుఁ ; గావునఁ జెప్ప భూమీశ : వలసె ;
నెందుఁ బాపం బింకఁ బొందదు మమ్ము :
ధ్రువము “రాజానుమతో ధర్మ" యనుట
యవనీశ ! యెఱుఁగవే" యనుడుఁ గోపించి 30
వసుధేశ్వరుఁడు బసవనఁ బిల్వఁబనుప
నసమాను నందలం బర్థి నెక్కించి
శివనాగుమయ్యకుఁ జేయిచ్చికొనుచుఁ
దివిరి యేతేరఁ దద్ద్విజులు వీక్షించి
“యదిగో మహారాజ ! యంతటఁ బోక
కదియవచ్చెడు మాలఁగలప నిచ్చటికి ;
డెందంబునను భయం బందమి సూడు !
మందలం బెక్కించి యతనిఁ దెచ్చెడిని ;
ఇంక నేరి కితండు శంకించు?” ననినఁ
గింకతో నగరివాకిలి సొరకుండ 40
వెలుపలికొల్వున విభుఁ డున్న యెడను....
నులుకక బసవయ్య యున్నతంబుగను
శివనాగుమయ్యకు సింహాసనముగ
భువిఁ దనపైచీర వుచ్చి పెట్టుచును
"బిరిచినపని యేమి పృథివీశ” యనినఁ
గలుషంబు గ్రమ్మ బిజ్జలుఁ డిట్టు లనియె :
“నాదిఁ దలంప వర్ణాష్టాదశముల
భేదంబు ; లవి నేఁడు పేర్కొన్నయవియె ?
కులసంకరము సేయఁగూడునే మాలఁ ?
గలపితి కళ్యాణకటక మంతయును ; 50
నీతలఁ బుట్టెనే నిటలాక్షుభక్తి ?
నీతిహీనుఁడ ! కుర్యునే వర్ష మింకఁ ?
బండునే యింక మీ రుండినభూమి ?
యొం డేల ? మీకు మే మోడుదు" మనుడు