పుట:Dvipada-basavapuraanamu.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

230

బసవపురాణము

వేదంబు లాదియో ; విధికల్సితంబు
లాదియో జాతుల కది యెట్టు లనినఁ :
జనువేదచోదితజాతులు రెండు ;
వినుము ప్రవర్తకంబును నివర్తకము ;
భవకర్మసంస్కారి భువిఁ బ్రవర్తకుఁడు ;
శివకర్మ సంస్కారి భువి నివర్తకుఁడు ;
సన్నుత వేదార్థచరితంబు లుండ
మొన్నఁ బుట్టిన కులమ్ములమాట లేల ! 90
స్రష్ట్రు క్తమగునట్టి జాతులు గావె
యష్టుదశంబులు నవి యేల చెప్ప ?
మిక్కిలి పదునెనిమిది వర్ణములకు
నిక్క. మారయ భక్తినిచయంబు కులము :
భాగ్యహీనుండు దాఁ బసిఁడిఁబట్టిన న
యోగ్యంపులోష్ట మై యున్నట్లు శివుని
ప్రతిబింబమూర్తి యౌ భక్తుండు భవికి
మతిఁ జూడ మానవాకృతి నుండు ధరణిఁ ;
గావున శివభక్తగణములమహిమ
భావింపఁ దలఁప నీప్రాప్తియే చెపుమ ! 100
కరివైరితోడఁ గుక్కలు వోల్ప సరియె ?
కరితోడ గ్రామసూకరములు సరియె ?
జడధితో నిలఁ జౌటిపడియలు సరియె?
వడి గంగతో వెడవ్రంతులు సరియె ?
తపసుతో ఖద్యోతతతు లెల్ల సరియె ?
యుపమింపఁ జంద్రుతో నుడుపంక్తి సరియె ?
మేరువుతోఁ బెరమెట్టలు సరియె ?
పారిజాతంబుతోఁ బ్రబ్బిళ్ళు సరియె ?
శివనాగుమయ్యతోఁ జెనఁటు లీద్విజులు
అవనీశ : సరియుఁ గా ; రది యెట్టు లనిన : 110
భక్తుండు శ్రీపతిపండితుం డీశు