పుట:Dvipada-basavapuraanamu.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

బసవపురాణము

పదపద్మసౌరభ భ్రమరాయమాణ
జంగమలింగప్రసాదోపభోగ
సంగతసుఖసుధాశరథినిమగ్న
సుకృతాత్మ పాలకురికి సోమనాథ
సుకవిప్రణీతమై శోభిల్లి తనరి
చరలింగ ఘనకరస్థలి విశ్వనాథ
వరకృపాంచిత కవిత్వస్ఫూర్తిఁ బేర్చి
చను బసవపురాణ మనుకథయందు
ననుపమంబుగను షష్ఠాశ్వాస మయ్యె. 810


___________