పుట:Dvipada-basavapuraanamu.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

శ్రీ శ్రితకంధర శ్రీపాదయుగ స
మాశ్రిత సంగనామాత్య : సత్కృత్య :

—: శివనాగుమయ్య కథ :—


మఱియును భక్తధీమణి లసత్కీర్తి
కఱకంఠభక్తాగ్రగణ్యుఁ డుత్తముఁడు
అసలార శివనాగుమయ్య సంప్రీతి
బసవనిచేఁ బ్రణిపత్తిఁ గైకొనుచు
ననయంబు భక్తిసుఖామృతాపార
వనది నిమగ్నుఁడై వర్తింపుచుండ
బుడిబుళ్ళవోవుచు భూసురులెల్లఁ
బుడమీశుకొలువుకుఁ బోయి యి ట్లనిరి ; 10
“వ్యక్తిగా విను పెద్దభక్తులు పెద్ద
భక్తు లంచును మన బసవయ్య వారిఁ
గడుఁగడుఁ గొనియాడుఁ, బడుఁ గాళ్ళమీఁద ,
గుడిచి డించినయది గుడుచు, వెండియును
వెఱవక సభ్యునివిధి మిమ్ముఁ గదియుఁ ,
దఱియంగఁజొచ్చు నంతర్నివాసములు,
వారును బురవీథి వచ్చుచోఁ దమ్ముఁ
జీరికిఁ గై కోరు నెంబలివారు ;
కథ లేల కళ్యాణకటక మంతయును
బ్రథితంబు మాలలపాలయ్యె నింక ; 20
నెక్కడివర్ణంబు ? లెక్కడినీతు ?
లెక్కడిధర్మంబు ? లి ట్లేల చెల్లు ?
రాజులఁ బొరయుఁ దద్రాష్ట్రంబుపాప
మోజమాలినవారి నొగిఁ బర్పకున్న ;