పుట:Dvipada-basavapuraanamu.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠా శ్వాసము

225

గ్రొవ్వడంగిరి దార్కికులు గూసి కుక్క
దువ్వుఁ దెచ్చికొనిన యవ్విధంబయ్యె ;
నీక్షితి బాచయ్య యితరమర్త్యుండె :
సాక్షాత్త్రి నేత్రుండు సత్య ; మి ట్లనుచుఁ
గొలువు దిగ్గనలేచి బిలిబిలి తార్కి
కులుఁ దాను నేఁగె బిజ్జలుఁడు దత్క్షణమ
బాచిరాజయ్యయు బసవయ్యముఖ్య
మైచను నిఖిలభక్తావళి యంతఁ 780
జనుశీలసద్భక్తి సౌభాగ్యమహిమ
దనరార జనులెల్ల ఘనకీర్తి సేయ
రాచిన సద్భక్తి గోచరుం డగుచు
బాచిరాజయ్య యెవ్పటియట్ల యుండె.
బాచిరాజయ్య విభ్రాజితచరిత
మేచినవీరమాహేశ్వరసభలఁ
జదివిన విన్నను సంస్తుతించినను
సదమలసద్భక్తిసౌఖ్యసారంబు
సహజైకలింగనిష్ఠాపరత్వంబు
మహితశివాచారమహిమయుఁ బొందు. 790
నాతతసకలపురాతనచరిత
గీతానుభవసుఖ కేలీవిలోల !
విహితశాస్త్రపురాణ వేదవేదాంత
మహితరహస్యార్థమార్గానుపాల :
తనుమనోధన నివేదనభక్తివినయ
జనితానురాగాత్మసద్భక్తి జాల !
విదిత ప్రసాదసవినయసౌఖ్యప్ర
ముదితాంతరంగసమున్నతలీల !
హృన్మందిరాంతర్నిహిత గురుధ్యాన !
మన్మిత్ర ! సంగనామాత్య ! సుశీల ! 800
ఇది యసంఖ్యాతమాహేశ్వరదివ్య