పుట:Dvipada-basavapuraanamu.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠా శ్వాసము

215

బరిచరు లై హరిప్రముఖులు గొలువ
నప్రతిమాకారుఁ డగులింగమూర్తి
కీప్రతిమాకారు లే సమానంబు ?
నిర్మలనిత్యనిష్కర్మ దేహునకు
దుర్మల దుష్ట దుష్కర్ములు సరియె ?
శుద్ధ ప్రసి ద్ధానిరుద్ధ దేహున క
సిద్ధ బౌద్ధాశుద్ధ జీవులు సరియె ?
చావుఁ బుట్టువులేని దేవదేవునకు
చావుఁబుట్టువుగల దేవత ల్సరియె ? 490
బ్రహ్మమాయాకారపశుపాశపతికి
బ్రహ్మేంద్రహరిముఖ్యపశువులు సరియె ?
శంకరునకు ధృతకంకాళునకును
శంకితు లగుచున్న కింకరు ల్సరియె ?
ప్రళయంబుఁ బొందించు ప్రళయరుద్రునకుఁ
బ్రళయంబుఁ బొందెడు పలువేల్పు లెనయె ?
మునిగణార్చిత పాదవనజాతునకును
మునిశాపదగ్ధు లౌ పినుఁగులు సరియె ?
పూజితుం డగు లింగపుంగవునకును
బూజించి కొలిచెడి పూజరు ల్సరియె ! 500
సిరిమహాదేవుఁ డౌ సిరిగిరిపతికి
సిరివాసు దేవాదిసురలు సమంబె ?
నలిమూఁడుగన్నులుగల త్రినేత్రునకు
నలరెండుగన్నులయతగులు సరియె ?
హాలాహలాగ్ని సంహారశౌర్యునకు
హాలాహలాగ్నిహతాంగులు సరియె ?
త్రిపురదైత్యాంత కోద్రిక్త వీర్యునకుఁ
ద్రిపురదై త్యోపద్రవపతితు ల్సరియె ?
యంధకాద్యసురదర్పాపహారునకు
నంధకాద్యసుర భయభ్రాంతు లెనయె ? 510