పుట:Dvipada-basavapuraanamu.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

216

బసవపురాణము

హరికమలజకపాలాస్థి ధారునకు
హరికమలజసురాసురతతి సరియె!
యావిర్భవింపని యభవున కరయ
దేవకీపుత్త్రాది దేవత ల్సరియె ?
లింగమూర్తికి జగత్సంగతాత్మునకు
లింగమధ్యములోని లెంగులు సరియె ?
సర్వజ్ఞుతోడ నసర్వజ్ఞు లెనయె ?
సర్వేశుతోడ నసర్వేశు లెనయె ?
షొడ్డల దేవుతో సోమేశుతోడ
సడ్డలదైవము ల్సర్చింప సరియె ? 520
హరుఁడు సర్వేశ్వరుం డభవుండు శివుఁడు
పరముఁడు వశుపతి పరమేశ్వరుండు
శ్రీమహాదేవుఁ డన్నామంబు లున్న
వే మహి నిటువంటి యితర వేల్పులకు ?
రమణఁ 'దద్విష్ణోః పరం పద ' మనఁగ
నమర విష్ణునకుఁ బరమమైనపదము
శ్రుతి “సదా పశ్యంతి సూరయో" యనఁగ
గతకర్ము లీశుండకాఁ గనియుండఁ
గుమతు లై కర్మశాస్త్రముల వెంబడిని
బ్రమసియో యిలఁ గుక్కపాలు ద్రాగుటనొ 530
మఱి నాము మేసియో మతిమాలినట్టి
యఱవపాఱులమాట లవనీశ ! వినకు;
మపునర్భవత్వంబు నచ్యుతత్వంబు
నుపమింప విష్ణున కున్న దే యెందు ?
పూని మాభృగుశాపమున నచ్యుతుండు
తా నుదయింపఁడే దశజన్మములను ?
సామ మా “విష్ణుః పితామహా'త్తనఁ బి
తామహునకు హరి దాఁ బుట్టెఁ గాదె ?
యజునిగుదంబున హరి పుట్టుటకును