పుట:Dvipada-basavapuraanamu.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214

బసవపురాణము

కర్మంబ యంతకుఁ గర్త యంటేనిఁ
గర్మం బచిత్తు దత్కర్తయు జడుఁడు ;
నెట్టన్న నన్యాయ మేమేనిఁజేయ
నట్టివానిఁ బఱప నధికారి గలఁడొ ?
తనకుఁదాఁ బఱపునో తత్కర్మఫలము ?
తనకుఁ దాఁ బంధించుకొనునొ తత్కర్త?
కావునఁ బఱప నొక్కఁడు గర్తఁగలఁడు
భావనఁ దత్కర్మఫలములు గుడుపు 460
నిలను గర్మాధీశుఁ డీశుండు గర్మ
ఫలదాత ; మాయుమాపతియె దైవంబు :
కర్మంబు గర్తయే! గ్రతువునఁ బుణ్య
కర్మి యంచును దక్షుఁ గడతేర్పవలదె ?
పితృవధ సేసిన యతికర్మఫలము
నతని బొందఁగనీక యఖిలంబు కెఱుఁగ
మేటికర్మము గర్త మృడుఁడు గాఁడేనిఁ
గాటకోటని కేల కైలాస మిచ్చె ?
నటు 'కృతం కర్మ శుభాశుభం' బనెడి ..
చిటిపొటివాదము ల్సెల్ల వెయ్యెడను 470
కోయని శ్రుతియు 'నేకో రుద్ర ఉచ్య
తే' యనుఁ గాన మాదేవుండె కర్త;
హరిముఖ్యు లీశుఁ బంచావరణములఁ
బరిచరులై కొల్చువశువులు గాక
కర్తలే ? యొక్కొక్క కార్యకారణవి
వర్తనమాత్రన వా; రెట్టు లనినఁ :
బనిసేయు బంట్లెల్ల మును దమచేయు
పనికె కర్తలుగాక ఫలకర్త లెట్లు ?
కాన కర్తలకర్త మానీలగళుఁడు :
దీనికి నిం కొండు దృష్టంబు లేల ? 480
పరమేశు చుట్టును ధర నూర నూరఁ