పుట:Dvipada-basavapuraanamu.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠా శ్వాసము

209

కర మనురక్తి బాచరుసు వెండియును
బనవయ్య మొదలుగా భక్తులు దాను
నసమమొడ్డోలగంబై యున్నయెడను
వింతచే నానందవిభ్రమం బెసఁగ
నంతంతఁ బాడంగ నంతంత నాడ
నదె వచ్చె వచ్చె వియన్మండలమున
నదె వచ్చె వచ్చె సోమేశుం డనంగ
నీరధు లేడు మూర్ణిల్లినభాతి
సారగంభీరవాద్యారవం బెసఁగ 320
భోరన మ్రోయుచప్పుడు వినఁబడఁగ
సౌరాష్ట్రనాథుఁ డాశ్చర్యం బెలర్పఁ
దివిరి కొట్టరువు గాదియ వ్రచ్చికొనుచు
భువిఁ బ్రతిష్ఠుం డయ్యె నవని గంపింప ;
' సిద్ధరామయ్య దా శ్రీగిరి కేఁగి
శుద్ధాత్ము మల్లికార్జునునిఁ బ్రార్థించి
కొనుచు నాసొన్నలికను పురంబునకుఁ
దా నెట్లు రప్పింపఁగా నేరఁడయ్యె ?
నిప్పు డిచ్చటనుండి యీబాచతందె
రప్పించుకొనియెఁ జేరఁగ సోమనాథు 330
నిట్టిధన్యుఁడు గల్గునే' యని భక్తు
లిట్టలంబుగ నుతియించుచు నుండ
నచ్చెరువందుచు నాబిజ్జలుండు
వచ్చి సాష్టాంగుఁడై వడిఁ బ్రణమిల్లి
సకలనియోగంబు జయవెట్ట బసవఁ
డకలంకలీల బాచయ్య నంకింప
[1]వలివేగమున గాదియలు వడఁద్రోచి
నెలకట్టుకట్టించి నిమిషమాత్రమున
వరరత్న ఖచితసువర్ణాలయంబు

  1. వాయువేగమున.