పుట:Dvipada-basavapuraanamu.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

బసవపురాణము

విరచించి కోటగోపురము లెత్తించి 340
ప్రవిమలోద్యద్భ క్తి బాచిరాజయ్య
శివరాత్రి నియమంబు సెల్లించె నంత ;
నలిఁగొట్టరువు సోమనాథుఁ డనంగ
వెలసె లోకావలి విమతింపుచుండఁ
డెల్లఁగా షొడ్డలదేవు బాచయ్య
సల్లీల సద్భక్తి కెల్లయై పరఁగ.
లలి నన్యసమయ కోలాహలమహిమ
కిల బిజ్జలుండు సహింపక మఱియుఁ
గుమతియై యప్పురిసమయులుఁ దాను
రమణఁ బ్రతాపనారాయణపురిని 350
గోవింద ప్రతిమ సద్భావం బెలర్పఁ
గావించి యొకగుడిఁ గట్టించి మంచి
దినమున నతనిఁ బ్రతిష్ఠగావించి
యనురాగలీలమై నంతఁ గొల్విచ్చి
యున్నెడ నఖిలనియోగంబు గొలువ
నన్నరేంద్రుఁడు దా నందఱఁ జూచి
“బాచిరా జటయేమి భక్తుండ ననియొ
యేచియో యీకార్య మెఱుఁగఁడో యెఱిఁగి
తా లెక్క చేయక తమకొలు వొల్లఁ
డో? లీల నిట్టి యొడ్డోలగంబులకుఁ 360
జనుదేరకుండు టే" మని యాగ్రహింప
మనుజేశునకు బసవనమంత్రి యనియెఁ :
దవిలి నీయుడిగంబుఁ దప్పించెనేని
బవరంబు ముట్టినఁ బాఱెనేనియును
దప్పవి దండింపఁ దగ వగుఁ గాక
యిప్పరదైవంబు లిండ్లిండ్లకడకు
నేల రా వనవచ్చునే పతి నీవు ?