పుట:Dvipada-basavapuraanamu.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

బసవపురాణము

నీపెద్దగాదియలోపలఁ గొలుచు
వేపోయబనుపుము వెడలి : సోమేశుఁ
డచ్చోటఁ బ్రత్యక్ష మయ్యెడి" ననుచు
నచ్చుగాఁ జెప్పుచు నతఁ డదృశ్యముగఁ
“జనుదెంచు నిచటికి సౌరాష్ట్ర నాథుఁ
డనుమాన ముడుగుఁడీ ! యది యెట్టు లనిన :
వచ్చెనే మున్ను రావణుని మన్నించి
యచ్చోన చిక్కెఁగా కని పల్కవలదు ; 290
భక్తుఁడే యతఁడు దపఃఫలోన్నతిని
శక్తిమంతుఁడు గాక చర్చించిచూడ
భక్తులచేఁ బట్టువడుఁగాక శివుఁడు
భక్తిహీనుల కేల పట్టిచ్చు శివుఁడు ?
విలసితభక్తి సద్విధి మెచ్చికాదె
యెలమి గుడ్డవ్వకు నెదురుగా వచ్చి
కదల కట్టుల చిక్కెఁగాదె సోమేశుఁ ;
డదియేల నావిందె గనుపురంబునను
గాపునఁ జూడంగఁ గందు మిప్పురిని
దేవునిరాకకు దృష్ట మిచ్చటికిఁ 300
బడిహారి భావనఁ బఱతెంతె నతఁడు
నడర సౌరాష్ట్రనాయకుఁడ కానోపు
సకళనిష్కలభావ సన్నుతశక్తి
నిక మెట్టి పడిహారులకు నున్న దెట్లు
వచ్చె నిట్లానతి యిచ్చె ? లోకులకు
నచ్చెరువుగ నెల్లి యరుదెంచుఁజుండి !
యిట యదృశ్యుం డయ్యె నీశుండ" యనుచుఁ
గటకంబునరులు విఖ్యాతి సేయంగఁ
దవిలి సమ్మదసముద్భవవారి గ్రమ్మ
శివునియానతి లేఖ శిరమునఁ దాల్చి 310
పుర మఫ్డు శుభముగా విరచింపఁ బంపి