పుట:Dvipada-basavapuraanamu.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

బసవపురాణము

నరిగెఁ జౌడయ్య దా నద్దరి నిలిచి
“పెల్లున లోకంబు లెల్లను ముంప
గొల్లన నడచు నీ త్రుళ్లెల్ల నడఁగె."
ననుచు నమ్ముసిఁడి చౌడయ్య సద్భక్త
జనసహితంబుగా ననురాగలీల 860
నరిగి యొప్పారఁ దత్పరిణయ క్రియలు
పరితోషమతి సమాప్తంబు గావించి
బగు తు లెదుర్కొన మగిడి కల్యాణ
నగరంబు వీథుల నడతెంచుచుండ
దపసియు నాఁబోతుఁ దనతోడ నడవ
విపరీత మతినరు ల్విభ్రాంతిఁ బొంద
జయజయధ్వను లాకసము నిండి చెలఁగ-
రయమునఁ బఱతెంచి రమణి యొకర్తు
భావించి చౌడయ్యపాదము ల్నొసలు
మోవంగ ధరఁ జాఁగి మ్రొక్కినఁ జూచి 870
యనునయం బొదవ “శతాయుష్య" మనుచుఁ
జనుదెంచి తమ నిజస్థాన దేశమున
దొల్లింటియట్ల యద్భుతలీల నుండ,
నల్లకన్యక మృతయైన మర్నాడు
జనకాదు లేడ్చుచుఁ గొని వచ్చివచ్చి
కనుఁగొని చౌడయ్యగారికి మ్రొక్కి
“నిన్న మీపాదముల్ నెన్నుదు రిఱియ
సన్నుతిమ్రొక్కిన సతి నేఁడు సచ్చె
నీదీవనయుఁ దప్పునే” యని వారు
పాదము ల్విడువక పలవరింపంగఁ 880
'దొలదొలఁ ' డనుచును 'ద్రోవ కడ్డంబు
నిలిచి వాచర్వక నిలునిలుఁ ' డనుచుఁ
గంపరం బవనిపై దింపించి మహిమ
వొంపిరిగొన నోరవోవఁ దట్టుచును