పుట:Dvipada-basavapuraanamu.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

191

కాదె నిన్ బోకార్చి కాల్నడయంద
యీ దేశమంతయు నెఱుఁగంగ దాఁటె;
మఱియు గజ్జెశ్వరుమసణయ్య దన్ను
మఱచి శివార్చనామగ్నుఁ డై నడుమ 830
నుండఁ బై రానోడి రెండుదిక్కులను
ఖండితంబై నీవ కావె పాఱితివి ?
వెడవాఁగ యే మని వెల్లి సూపెదవు ?
అడఁగుము ద్రోవ యి"మ్మనుచుఁ జౌడయ్య
యలుఁగుమోహణమున హ స్తంబు దొడిగి
జళిపింప నీ రెల్లఁ జల్ల నఁ బాసి
నీరిపర్వత మన నింగి నుప్పొంగి
తారాపథంబునఁ దా నిట్టవొడిచె
నాకాశ గంగచే హరు భక్తమహిమ
నేకాంతమున విన నేఁగినయట్లు ; 840
అయ్యేఱు ముసిఁడిచౌడయ్యకు వెఱచి
చయ్యన నేఁగె రసాతలంబునకు
నన్నట్లు త్రోవనీ రఱిముఱిఁ బఱవ
మిన్నక నడు మెల్లఁ దిన్నె లై యుండ
“ 'రండురం డిపుడు నీరము నడు మడువ
రెండుగా వనుమాట రిత్తయ్యె" ననుచు
ముసిఁడి చౌడయగారు ముందఱ నడవ
నసమభక్తానీక మానందలీల
నంతంత నిలుచుచు నార్చుచుఁ గప్పి
గంతులువైచుచు గతికి నిల్చుచును 850
నెడనెడ నార్చుచుఁ బెడబొబ్బ లిడుచు
వడిఁ బిల్ల మెఱములు వై చుచు లేచి
పరువులు వెట్టుచు నరుగ ముందఱను
నరుదారఁ దపసియు నాఁబోతు వడవ
దరహసితోల్లాసవరవక్త్రుఁ డగుచు