పుట:Dvipada-basavapuraanamu.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

193

'నెనయ దీవించువా రేండ్లేల యిత్తు'
రనుపలు కప్పుడ [1]యాలంబు గాఁగ
నిశితఖడ్గం బార్చి నిఖిలంబు నెఱుఁగ
'శిశువ ! లెమ్మని పేరఁ జీరఁగఁ దడవఁ
గట్టులు వటు కనఁగాఁ దెగి నిద్ర
బిట్టుల్కి తెప్పిఱినట్టును బోలె 890
నతిసంభ్రమాక్రాంతమతిఁ దేఱిచూచి
యతివ సౌడయ్యకు సాష్టాంగ మెరఁగెఁ :
దల్లియుఁ దండ్రియుఁ దమపుత్రితోన
యుల్లంబు దళుకొత్త నొగిఁ జాల మ్రొక్కి
“ముసిఁడిచౌడాచార్య ! యసమానశౌర్య !
వసమె నీగరిమంబు వర్ణింపఁ దలఁపఁ!
బ్రాణోపకారికిఁ బ్రత్యుపకార
మేణాంకధమూర్తి ! యిలఁ జేయఁ గలదె?
దాసులఁగా మమ్ము దయ నుద్దరింపు
మీసంసరణవార్ధి యింకఁదోఁపంగ" 900
నంచు విన్నప మాచరించుడు మువుర
నంచిత ప్రాణలింగాంగులఁ జేసి
గతవత్సరంబులు గాక మూవురకు
శతవత్సరాయు వాయతిఁ గరుణింపఁ
“బ్రాణదానము సేయఁ బరులవశంబె ?
యేణాంకధరునకు నిల నరుదన్న
జా నొందఁగ ముసిఁడిచౌడయ్య వ్రాణ
దానంబుసేసెఁ జిత్రము సిత్ర" మనుచు
మ్రొక్కుచు లోకంబు వెక్కసపడఁగ
నెక్కుడుకీర్తీకి నెల్లయై యంత 910
మహనీయసద్భక్తిమహిమ దుల్కాడ
సహజై కలింగి యాచౌడయ్య నడవ

  1. అబద్దము.