పుట:Dvipada-basavapuraanamu.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

173

'నో'యనెఁ బిలిచిన; 'హే'యన్న సుడిగె ;
నింతటిలోన నీరేడులోకములు
సంతాపవర్తన సమసుప్తిఁ బొందె :
నిప్పుడు గరుణింప ని ట్లుల్లసిల్లెఁ ;
జెప్పఁ జిత్రముగాదె యెప్పాటనైనఁ
బరఁగంగ నిహలోకపరలోకములకు
హరుఁడవు నీవ; శంకరుఁడవు నీవ :
భవుఁడవు నీవ ; సద్భక్తుండ వీవ ;
భువిలోన మఱి సెప్ప బోల్పంగఁ గలరె? 320
నిద్దంబుగా నీట నద్దుము వాల
నద్దుము మా కింక నన్యథా లేదు ;
ఒక్క మాకేల . బ్రహ్మోక్తజీవులకు
నిక్కంబు దెస దిక్కు నీవ కా వెట్లు :
కావున మముఁ గటాక్ష ప్రేక్షణముస
భావింవవే కృపాభావం బెలర్ప.”
ననుచు మఱియు మ్రొక్కి యభినుతి సేయఁ
గనుఁగొని దరహాసకలితాస్యుఁ డగుచుఁ
"గఱకంఠుభక్తుల కఱగొఱలేక
వెఱచి బ్రదుకు వొమ్ము వేయును నేల !" 330
యని మును విశిరస్కు డైనమానవునిఁ
జను లెల్లరు నెఱుంగ సప్రాణుఁ జేసి
చనియెఁ గిన్నరబ్రహ్మ శరణుండు భక్త
జనులును బసవఁడు ననురాగమంద ;
'నిశ్చయం బీతఁడే నిటలాక్షు' డనుచు
నాశ్చర్యహృదయుఁ డై యరిగే బిజ్జలుఁడు :
అంత నట్టులు గిన్నరయ్య సద్భక్తి
కాంతుఁడై త్రిభువనఖ్యాతి మై నుండెఁ.
బసరింపఁ గిన్నర బ్రహ్మయ్యచరిత
మసలారఁ జదివిన నర్థిమై విన్న 340