పుట:Dvipada-basavapuraanamu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

బసవపురాణము

డవిరళగతిఁ గిన్నరన్నకు మ్రొక్కి,
“సజ్జనశృంగార : సత్యగంభీర !
యిజ్జగదాధార : యీశ్వరాకార !
మంగళగుణధామ : మహిమాభిరామ !
లింగాభిరూప ! యభంగప్రతాప !
నిర్జితాహంకార ! నిఖిలోపకార !
దుర్జనదూర ! విధూతసంసార !
కారుణ్యపాత్ర ! యకల్మషగాత్ర !
వీరవ్రతాచార్య ! విపరీతశౌర్య ! 290
యంచితాగణ్య ! నిరంతరపుణ్య !
సంచితసుఖలీల ! శరణవిలోల !
సన్నుతకీర్తి : సాక్షాద్రుద్రమూర్తి !
కిన్నరబ్రహ్మయ్య ! కృపసేయు" మనిన
బనవయ్య చేవ్రేసి ప్రహసితుం డగుచు
నసమాక్షుఁజూచి 'హే' యనుచు వారింపఁ
దొల్లిటియట్ల యద్భుతలీల నడరె;
నెల్లలోకములు మహిష్ఠతఁ బరఁగెఁ :
గటకంబు సూడ నెప్పటియట్ల ప్రబలె ;
నిటచరాచరజీవు లెల్లను బ్రదికె. 300
బిజ్జలు డంతలో బిమ్మటి దెలిసి
యజ్ఞనౌఘముఁ దాను సాష్టాంగ మెరఁగి
“యభయమే జియ్య : యత్యద్భుత కీర్తి!
యభయమేదేవ ! మహామహిమాఢ్య |
కిన్నరబ్రహ్మయ్య ! గీర్వాణవంద్య :
కన్నులు గానని కష్టలోకులము ;
ఆజ్ఞానజీవుల మపగతమతుల ;
మజ్ఞల ; మధిక సర్వాపరాధులము :
కడసన్న నీదువిఖ్యాపితమహిమ
కడ యెఱింగెద మనగా మాతరంబె ? 310
నీయాజ్ఞఁ దలమోచి నిటలలోచనుఁడు