పుట:Dvipada-basavapuraanamu.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

171

లలుఁగు[1] మోహణముస హ స్తంబు దొడిగి
కిన్నరబ్రహ్మయ్య సెన్ను దుల్కాడఁ
బన్నగధరుమహాభక్తులఁ దలఁచి
యాయతి నభిముఖుం డై “త్రిపురాంత
కా" యని పిలుచుడు "నో" యనుచుండె,
బిట్టుల్కి మూర్ఛిల్లి [2]బిమ్మటిఁ బొంది
నెట్టోడి లింగసన్నిహితులు దక్క- 260
ఖగమృగోరగ నరకరితురగాదు
లగు సమస్తచరాచరాది జంతువులు
నుక్కఱి మ్రగ్గి యట్లున్నవి యున్న
చక్కటిఁ బ్రాణము ల్గ్రక్కున విడిచె ;
నాకటకం బిట యట కానఁబడియె;
లోకంబులెల్లఁ గల్లోలంబు నొందె ;
నీక్షితి గంపించె; వినుఁ డస్తమించె;
నక్షత్రములు డుల్లె; నగములు ద్రెళ్ళె ;
నంబుధు లింకెఁ ; గూర్మంబుఁ దలంకె ;
నంబరం బిల మ్రొగ్గె; నహిపతి స్రగ్గె; 270
ననిలుండు దొలఁగె ; స్వాహాపతి మలఁగె :
వనజనాభుఁ డులికె; వనజజుఁ డలికె;
సమసుప్తిఁ బొందించి జగములఁ ద్రుంచి
ప్రమథులు లోకముల్ దమమయంబుగను
నాడుచుఁ బాడుచు ససమానలీలఁ
గ్రీడింప మఱియు సత్క్రియ దులుకాడ
నవికలానేకభక్తావళి వేర్చి
సవిశేషగతి మహోత్సవములు సలుప
బాయక రేయును బగలును గూడ
మ్రోయంగ నేడ్దినంబులు సన్నపిదప 280
భువనోపకారార్ధబుద్ధిమై బసవఁ

  1. పిడి.
  2. స్పృహతప్పుట.